ఒడిశాలోని పూరీలో కొలువైన జగన్నాథస్వామి ఆలయంలో ఇకపై సెల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ఈ నిబంధన వచ్చే జనవరి నుంచి అమలులోకి రానుంది. ఇప్పటి వరకు భక్తులు మాత్రం ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదు..వినియోగించకూడదనే నిబంధన ఉంది. ఇప్పుడా నిబంధన పోలీసు సిబ్బందికి కూడా వర్తించనుంది. జనవరి 1 (2023) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ఈ నిబంధనలతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకువెళ్ళవచ్చు.
0 Comments