Ad Code

Responsive Advertisement

వైకుంఠ ఏకాదశికి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ముస్తాబు

 జనవరి 2, 3వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వారం ఏర్పాటు చేయనున్నారు.

జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 12.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొలుపుతారు. 12.30 నుండి 3.00 గంటల వరకు మూలవర్లకు తోమాల సేవ, కొలువు తదితర సేవలను నిర్వహిస్తారు. ఉదయం 2 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

జనవరి 3వ తేదీ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జనవరి 2, 3వ తేదీలలో ఆర్జిత కల్యాణోత్సవం సేవ రద్దు చేశారు.

Post a Comment

0 Comments