ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం అంటే డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెల అంటే జనవరి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగకు ముందే చేపట్టే ధనుర్మాస ఉత్సవాల్లో గోదాదేవి మనోవల్లభుడైన శ్రీంగ నాథుడిని ఆరాధించే పర్వాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారికి ఉత్సవ సేవ నిర్వహిస్తారు. ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్ లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపించనున్నారు. బ్రహ్మీకాలంలో అమ్మవారు స్వామి వారిని ఆరాధించే పర్వాన్ని పాశుర పఠనం, పొంగళి నివేదనలతో కొనసాగిస్తారు.
జనవరి 14వ తేదీన రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, మర్నాడు అంటే జనవరి 15వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
0 Comments