Ad Code

Responsive Advertisement

కార్తీక మాసం లో తినకూడనివి..?

కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసం మొత్తం ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందు ఇంటి గడపల వద్ద, తులసి చెట్టు వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. కార్తీకంలో అల్పాహారం తీసుకుని, ఒంటిపూట భోజనం చేసేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి దినాల్లో ఉపవాసం, దీపారాధన చేయాలి.



అలాగే  ఈ మాసంలో ఉల్లి, పుట్టగొడులు, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడి, వెలగపండు, మాంసాహారం, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు వాడకూడదు. కార్తీకస్నానం చేసినవారి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. కార్తీక దీపాన్ని శివలింగ సన్నిధిలో దీపారాధన చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతోగాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని పురాణాలు చెప్తున్నాయి. 

Post a Comment

0 Comments