Ad Code

Responsive Advertisement

మాఘ పౌర్ణమి , మహా మాఘి



  • శిశిర ఋతువులో వచ్చే తొలి మాసం మాఘ మాసం. మాఘమాసం అంటే పాపాలను నశింపచేసేది అని అర్ధం.
  • మన ధర్మంలో పవిత్ర తిధుల్లో ఆచరించవలసిన వాటిలో స్నానం తోలినియమంగా చెబుతారు. స్నానాలకు సంబంధించి మాఘమాసానికి ప్రత్యేకత వుంది.
  • కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది.
  • మాఘమాసంలో  సూర్యుని లేలేత కిరణాలు నుంచి వచ్చేశక్తి జాలంలో  సంపూర్ణంగా ఉన్నపుడే స్నానం చేయాలి అని పెద్ద సూచన.
  • మాఘమాసం అంత స్నానవ్రతాని పాటించాలి. కృష్ణ ద్వాదశినాడు కానీ, మాఘపౌర్ణమి నాడు కానీ వ్రతం సమాప్తి చేయాలి. 
  • ఈ మాసమంతా స్నానం వ్రతం చేయలేకపోయినా మాఘపౌర్ణమి నాడు సంకల్పం చెప్పుకొంటూ స్నానం చేస్తే ప్రయాగ స్నానఫలం లభిస్తుంది.
  • సముద్ర స్నానానికి ఆషాడ, కార్తీక, మాఘ,వైశాఖ పౌర్ణమి తీర్థులు శ్రేష్టం అని అంటారు.
  • మహామాఘి నాడు గంగ యమునా సంగమ ప్రదేశాలలో స్నానం చేయడం మహా పాతక నివారణ.

సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు :

  • అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే వంటికి నూనె రాసుకోకూడదు.
  • సముద్రపు నీటితో ఆచమనం చేయకూడదు.
  • ఆచమనం విడిగా చేసి సముద్ర స్నానం చేయాలి.
  • అశౌచం ఉన్నపుడు సముద్రాన్ని తాకకూడదు.
  • పౌర్ణమి గడియలు ఉండగా ఆ సమయంలో అయినా స్నానం చేయవచ్చు. కానీ సూర్యాస్తమయం తరువాత పనికిరాదు.
మహామాఘి విధులు :

  • సతీదేవి మాఘ మాసంలోనే జన్మించింది.
  • మహా మాఘి నాడు బ్రహ్మ వైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
  • ఈ రోజు తిలదానం,తిలహోమం, తిల భక్షణం చేస్తే మంచిది అంటారు.
  • ఈ రోజు దుప్పట్లు, తైలం, వస్త్రాలు,చెప్పులు, గొడుగు, నెయ్య , బంగారం, అన్నదానం చేయడం వల్ల నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది.
  • మాఘపౌర్ణమి నాడు సువాసిని పూజ చేస్తే రాబోయే ఏడు జన్మలకు కూడా సౌభాగ్యం వర్ధిలుతుంది.
  • ఈ రోజు అమ్మవారిని ఉపవాసంతో ఆరాధించి పాయసం నివేదన చేయాలి. అందువల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని పద్మ పురాణం చెబుతోంది. 
2021 : ఫిబ్రవరి 27.

Post a Comment

0 Comments