Ad Code

Responsive Advertisement

బొలికొండ రంగనాధ స్వామి వారి బ్రహ్మోత్సవాలు - తొండపాడు, 2021

రాయలసీమలోని సుప్రసిద్ధ దేవాలయాలలో బోలికొండ రంగనాథ క్షేత్రం ఒకటి.అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నుంచి గుత్తి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారిలో గుత్తి పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ‘తొండపాడు’ గ్రామం ఉంది.



స్వామి వారికీ ప్రతి ఏటా మాఘ శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


సేవల వివరాలు 

ఫిబ్రవరి  21 - అంకురార్పణ, ధ్వజారోహణం
ఫిబ్రవరి 22 - సింహ వాహనం
ఫిబ్రవరి 23 - శేష వాహనం
ఫిబ్రవరి 24 - హనుమంత వాహనం
ఫిబ్రవరి 25 - గరుడ వాహనం 
ఫిబ్రవరి 26 - గజ వాహనం
ఫిబ్రవరి  27 - స్వామి వారి కళ్యాణం, రథోత్సవం
ఫిబ్రవరి 28 - పారువేట అశ్వ వాహనం
మార్చి 01 - వసంతోత్సవం,హంస వాహనం.

ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి?

‘తాడిపత్రి – గుత్తి’ ప్రధాన రహదారిలో వున్న తొండపాడు వద్ద బస్సులు ఆగుతాయి.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు అటు గుత్తిలో కానీ, ఇటు తాడిపత్రిలో గానీ దిగి “తొండపాడు’’కు చేరుకొనవచ్చు. చెన్నై – ముంబాయి రైలు మార్గంలోని “జక్కల చెరువు’’ రైల్వేస్టేషన్ తొండపాడుకు సమీపంలోని రైల్వేస్టేషన్. అయితే ఈ స్టేషన్ లో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్ళు మాత్రమే ఆగుతాయి. కనుక గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ లో దిగి బస్సు ద్వారా తొండపాడుకు చేరుకొనవచ్చు.

Post a Comment

0 Comments