సుమారు తిరుమలలో ఏడాదికి 450 పైనే ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనవి మాత్రం స్వామివారికి తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు.
బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవాలని అంటారు. ముందురోజు సాయంత్రం అంకురార్పణ, శ్రీవారి సేనాధిపతి విష్వక్సేన వారి ఆధ్వర్యంలో మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.
తరువాతరోజు ధ్వజారోహణనాడు బంగారు ధ్వజస్తంభం పై గరుడకేతనాన్ని ఎగురవేస్తూ సర్వలోకవాసులు ఆహ్వానింపబడతారు.
మరునాడు ఉదయం సాయంత్రం రెండువేళలా రెండవరోజు చిన్నశేషవాహనం, హంసవాహనం మూడవరోజు సింహవాహనం ముత్యపుపందిరి, నాల్గవరోజు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం ఐదవరోజు ఉదయం దంతపు పల్లకిలో మోహినీ అవతారం, ఆ రాత్రి గరుడోత్సవం జరుగుతుంది. శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి ధరించిన పూలమాల, మద్రాసు నుంచి కొత్త గొడుగులు వస్తాయి. వీటినన్నింటిని ధరించిన మలయప్పస్వామి బంగారు గరుడునిపై ఊరేగింపబడుతాడు. లక్షలాది మంది భక్తులు గరుడోత్సవాన్ని తిలకిస్తారు.
ఇక ఆరవరోజు హనుమద్వాహనం, గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఎనిమిదో రోజు రథోత్సవం, అశ్వవాహనం జరుగుతాయి. తొమ్మిదో రోజు చక్రస్నానం. ఆ రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడుతాయి
అధికమాసం వచ్చిన ఏడాది తిరుమలేశునకు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతాయి. ఒకటి కన్యామాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గాను మరొకటి శరన్నవరాత్రులలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు గాను నిర్వహింపబడుతాయి.
0 Comments