- తమిళనాడు రాష్టంలోని కుంభకోణం పట్టణం చుట్టూ ప్రక్కల ఆలయాలు ఈ నవగ్రహ క్షేత్రాలు
- ఈ ఆలయాలు అన్ని 9 వ శతాబ్దం నుండి 11 వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది.
- ఈ ఆలయాలను చోళ రాజులు నిర్మించగా, తంజావూరు పాలకులు విజయనగర రాజులు అభివృద్ధి చేసారు.
- ఈ ఆలయాలలో ఒక సూర్యనార్ ఆలయంలో తప్ప మిగిలిన క్షేత్రాలలో శివుడే ప్రధాన దైవం.
- సూర్యనార్ ఆలయంలో స్వయంగా సూర్యభగవానుడు కొలువుతీరి ఉన్నాడు.
- ఈ ఆలయాలు దర్శించడం వల్ల ఆ గ్రహాల దుష్ప్రభావం ఉంటే తొలిగిపోతుంది.
స్థల పురాణం
పూర్వం ఒకసారి బ్రహ్మ నవగ్రహ దేవతలను చూస్తూనే బాధకు లోనయ్యాడు. నవగ్రహాలకు దేవతలు భక్తులకు వరాలను ప్రసాదించే శక్తి లేకపోవడమే సృష్టికర్త బాధకు కారణం. అనేక రకాలుగా ఆలోచించిన బ్రహ్మదేవుడు - "మీరందరూ కుష్టువ్యాధిగ్రస్తులై భూలోకానికి వెళ్ళుగాక" అని శపించాడు. దీనితో నవగ్రహాలు కుష్టువ్యాధి గ్రస్తులై భూలోకంలోని తెల్లని పూలచెట్లు వున్న వెల్లురుక్కువనం. ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి చేరినవారు తమ కుష్టువ్యాధిని తొలగించుకునేందుకు రకరకాలుగా ఆలోచించి చివరకు శివుడిని ఆరాధిస్తే మంచిదని భావించి శివుడిని గురించి తపస్సు చేశారు. వారి తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమై వారి కుష్టువ్యాధిని తొలగించడంతోపాటు వారికి భక్తులను అనుగ్రహించేందుకు అవసరమైన శక్తులను ప్రసాదించడంతోపాటు ఆ చుట్టు ప్రక్కలప్రాంతాలలోనే కొలువుదీరి వారు వుండేటట్లు వరాన్ని ప్రసాదించాడు. శివుడు ప్రసాదించిన వరం ప్రకారం నవగ్రహాలు వివిధ ప్రాంతాలలో కొలువుదీరిగా వాటికి నవగ్రహక్షేత్రాలు అనే పేరు ఏర్పడినట్లు స్థలపురాణం వెల్లడిస్తూ వుంది.
సూర్యనార్ కోయిల్ - సూర్య క్షేత్రం
- ఇక్కడ ప్రధాన దైవం సూర్యభగవానుడు
- ఈ ఆలయ ప్రాంగణంలో మిగతా ఎనిమిది మూర్తులు కూడా ఉన్నారు.
- కుంభకోణం నుండి 15 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
చంద్రగ్రహ క్షేత్రం - తింగలూరు
- ఇక్కడ శివుడు లింగరూపంలో శ్రీ కైలాసనాథస్వామిగా కొలువుదీరి పూజలు అందుకుంటున్నాడు
- ఆలయ ప్రాంగణంలో ఉన్న చంద్రుడిని దర్శించడం వల్ల మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి
- కుంభకోణం నుండి 32 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
అంగారక క్షేత్రం - వైదీశ్వరన్ కోయిల్
- ఇక్కడ శివుడు శ్రీవైద్యనాథేశ్వర స్వామిగా, అమ్మవారు తైయల్ నాయకి దేవి.
- ప్రధాన ఆలయం వెనుక అంగారకుడు దర్శనమిస్తాడు
- ఈ క్షేత్ర దర్శనం వల్ల కుజదోషంతో వివాహం ఆలస్యమైనా వారికీ సత్ఫలితాలు కలుగుతాయి
- కుంభకోణం నుండి 45 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
బుధక్షేత్రం - తిరువెంకాడు
- ఈ ఆలయంలో శివుడు శ్రీ శ్వేతరణ్యేశ్వరర్ పేరుతో అమ్మవారు బ్రహ్మవిద్యాదేవి పేరుతో కొలువుతీరి ఉన్నారు.
- ఆలయ ప్రాంగణంలో బుధుడికి ప్రత్యేక ఆలయం ఉంది.
- ఈ క్షేత్ర దర్శనం వల్ల బుధగ్రహదోషాలు తొలగిపోతాయి
- కుంభకోణం నుండి 60 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
గురుక్షేత్రం - ఆలంగుడి
- ఈ క్షేత్రంలో శివుడు అభాగ్యతేశ్వర స్వామిగా, అమ్మవారు ఉమాదేవి.
- దక్షిణామూర్తికి , గురువుకి ప్రత్యేక ఆలయాలు వున్నాయి.
- ఈ క్షేత్ర దర్శనం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
- కుంభకోణం నుండి 18 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
శుక్రగ్రహ క్షేత్రం - కంజనూరు
- ఈ క్షేత్రానికి పలశవానం, బ్రహ్మపరి, అగ్నిస్థలం అని పేర్లు
- ఇక్కడ స్వామివారు అగ్నీశ్వర స్వామిగా, అమ్మవారు కర్పగాంబికాదేవి.
- ఈ క్షేత్ర దర్శనం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
- కుంభకోణం నుండి 18 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
శనిగ్రహ క్షేత్రం - తిరునల్లూర్
- ఇక్కడ స్వామివారు దర్బరణ్యేశ్వరర్ స్వామిగా, అమ్మవారు పూనమల్లిదేవి
- శనేశ్వరుడు ప్రత్యేక ఆలయంలో దర్శనమిస్తాడు
- ఇక్కడ ఉన్న నలతీర్థంలో స్నానం చేసి స్వామిని దర్శించడం వల్ల శనిగ్రహ భాదలు తొలగిపోతాయి.
- కుంభకోణం నుండి 52 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
రాహుగ్రహక్షేత్రం - తిరునాగేశ్వరం
- ఇక్కడ శివుడు శ్రీ నాగనాథస్వామిగా అమ్మవారు శ్రీ గిరిజాంబిక దేవిగా కొలువై ఉన్నారు.
- ఇక్కడ ప్రతి రోజు రాహుకాలంలో పాలాభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో పాలు స్వామి తల పై పోస్తే స్వామివారి కంఠం వద్దకు వచ్చేసరికి పాలు నీలం రంగులోకి మారడం విశేషం.
- కేవలం రాహుకాలం మాత్రమే ఇలా జరుగుతుంది
- ఇక్కడ రాహువుకి ప్రత్యేక ఆలయం ఉంది
- ఈ క్షేత్ర దర్శనం వల్ల రాహుగ్రహ బాధ తొలగిపోతుంది
- కుంభకోణం నుండి 5 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
కేతుగ్రహ క్షేత్రం - కిల్ పేరుంపళ్ళం
- ఈ క్షేత్రంలో పరమశివుడు నాగనాథస్వామిగా అమ్మవారు సౌందర్యనాయకిదేవిగా కొలువై ఉన్నారు.
- కేతువుకి ప్రత్యేక ఆలయం ఉంది
- కేతువుకు ఎదురుగా ఏడు ప్రమిదలతో దీపాలు వెలిగించి పూజించడం వల్ల కేతుగ్రహ దోషాలు తొలగిపోతాయి.
- కుంభకోణం నుండి 58 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం
చెన్నై నుండి కుంభకోణం 293 కిమీ దూరంలో ఉంది.
0 Comments