Ad Code

Responsive Advertisement

తిరుచానూరు ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే వివిధ సేవలు

 తిరుమల శ్రీవారికి లాగానే అమ్మవారికి కూడా విశేష సేవలు జరుగుతూ ఉంటాయి వాటి వివరాలు 



నిత్యోత్సవం 


  • ఇవి ప్రతిరోజు జరిగే ఉత్సవాలు 
  • ప్రతి రోజు అమ్మవారికి సుప్రభాత సేవ, మూలమూర్తికి సహస్రనామార్చన తరువాత నివేదన జరుగుతుంది.
  • ప్రతి రోజు నిత్యా కల్యాణోత్సవం జరుగుతుంది 
  • ప్రతి రోజు సాయంత్రం అమ్మవారికి డోలోత్సవం జరుగుతుంది 
  • రాత్రి ఏకాంతసేవతో సేవలు ముగుస్తాయి.


వారోత్సవాలు 


ప్రతి వారం జరిగే ఉత్సవాలు 


  • ప్రతి సోమవారం అమ్మవారికి అష్టదళపాద పద్మారాధన జరుగుతుంది 
  • గురువారం రోజు తిరుప్పావడ మూలమూర్తికి జరుగుతుంది 
  • శుక్రవారం రోజు మూలమూర్తికి అభిషేకం జరుగుతుంది 
  • శుక్రవారం రోజు కల్యాణోత్సవం ముందు లక్ష్మి పూజ జరుగుతుంది.
  • శుక్రవారం రోజు తోట ఉత్సవం జరుగుతుంది అనగా కల్యాణోత్సవం తరువాత గుడికి దక్షిణ దిక్కులో వున్న శుక్రవారపు తోటకు వెళ్లిన తరువాత మధ్యాహ్నం 3 గంటలకు పసుపు, చందనం మొదలగు ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది.
  • శుక్రవారం రోజు ఉంజల్ సేవ తరువాత గ్రామోత్సవం జరుగుతుంది.
  • శనివారం ఉదయం పుష్పాంజలి సేవగా పద్మాలతో మూలమూర్తికి పుష్ప అర్చన జరుగుతుంది.

నక్షత్రోత్సవాలు 

  • ప్రతి నెల ఉత్తరాషాఢ, ఏకాదశి రోజులలో అమ్మవారి ఉత్సవమూర్తికి ఏకాంతంగా అభిషేకం జరుగుతుంది.
  • ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సాయంత్రం అమ్మవారు గజవాహనం మీద దర్శనమిస్తారు.

సంవత్సరంలో జరిగే ఉత్సవాలు 

  • ఉగాది రోజు ఉత్సవాలు జరుగుతాయి, పంచాంగ శ్రవణం జరుగుతుంది 
  • వైశాఖ పూర్ణిమకు మూడురోజులపాటు వసంతోత్సవాలు జరుగుతాయి, పౌర్ణమి రోజు స్వర్ణరథోత్సవం జరుగుతుంది 
  • జ్యేష్ఠా పౌర్ణమికి పూర్తి అయ్యేటట్లు ఐదురోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి 
  • భాద్రపద మాసంలో పౌర్ణమినాటికీ పూర్తి అయ్యేటట్లు మూడురోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. 
  • కార్తీక మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, పంచమి తీర్థం రోజు విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శిస్తారు.
  • బ్రహ్మోత్సవాలు ప్రారంభం ముందు రోజు లక్ష కుంకుమార్చన జరుగుతుంది 
  • బ్రహ్మోత్సవాలు తరువాత శ్రవణానక్షత్రం రోజున పుష్పయాగం జరుగుతుంది. 
  • పుష్యమాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రతేక్య పూజలు జరుగుతాయి.

Post a Comment

0 Comments