Ad Code

Responsive Advertisement

పంచ ప్రయాగాలు

రిషీకేశ్ నుండి బదరీనాథ్ వెళ్ళేదారిలో ఈ పంచ ప్రయాగాలు మనకు వస్తాయి. అవి దేవప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణు ప్రయాగ. 





దేవప్రయాగ 


  • ఇది అలకనంద మరియు భగీరథ నదుల సంగమం
  • ఇక్కడ రఘునాధ మందిరం ఉంది.
  • ఇక్కడ శ్రీరాముడు అశ్వమేధయాగం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.
  • రిషీకేశ్ నుండి  70కి.మీ దూరం


రుద్రప్రయాగ 


  • ఇక్కడ మందాకినీ మరియు అలకనంద నదుల సంగమం
  • శంకరుడు వీణానాదాన్ని ఆలపించిన చోటుగా ప్రసిద్ధి.
  • ఇక్కడ రుద్రనాథ మందిరం, చాముండదేవి ఆలయం ఉన్నాయి.
  • రిషీకేశ్ నుండి  140కి.మీ దూరం


నందప్రయాగ 


  • ఇక్కడ నందాకిని మరియు అలకనంద నదుల సంగమం
  • ఇక్కడ  కణ్వాశ్రమము కూడా ఉంది 
  • దుష్యంతుడు, శకుంతలను వివాహం చేసుకున్న స్థలం
  • నందగోపాలా మందిరం ఉంది 
  • రిషీకేశ్ నుండి  190కి.మీ దూరం



కర్ణప్రయాగ


  • ఈ ప్రాంతంలో అలకనంద మరియు  పిండారీ నదుల సంగమం.
  • ఇక్కడ ఉమాదేవి ఆలయం ఉంది 
  • కర్ణుడు తపమాచరించి శంకరుని ప్రసన్నం చేసుకున్న ప్రదేశం. 
  • స్వామివివేకానంద ఇక్కడ 18రోజులు తపమాచరించాడు.
  • రిషీకేశ్ నుండి  170కి.మీ దూరం


విష్ణు ప్రయాగ


  • ఇది అలకనంద, దౌలిగంగా నదుల సంగమం
  • ఈ సంగమం వద్ద విష్ణు కుండం కూడా ఉంది 
  • నారదుడు విష్ణు భగవానునికై తపమాచరించిన ప్రదేశమిది.
  • ఇక్కడ విష్ణు ఆలయం కూడా ఉంది. 
  • రిషీకేశ్ నుండి  260కి.మీ దూరం


Post a Comment

0 Comments