Ad Code

Responsive Advertisement

రమా ఏకాదశి

 

రమా ఏకాదశి ఆశ్వయుజ మాసం లో కృష్ణ పక్షం లో జరుపుకుంటారు. ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసం లో వస్తుంది. సరిగ్గా దీపావళి కి నాలుగు రోజుల ముందు ఈ ఏకాదశి ని జరుపుకుంటారు.


బ్రహ్మ వైవర్త పురాణం లో రామ ఏకాదశి గురించి ప్రస్తావన వుంది. రమా ఏకాదశి రోజు విష్ణు కథలు వింటే వైకుంఠం చేరుకుంటారు అని భక్తులు విశ్వసిస్తారు. నియమ నిష్ఠాలతో ఈ ఏకాదశి ని ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు విష్ణు ఆరాధన వల్ల కష్టాలు దూరమై మంచి జీవితం పొందుతారు.


ఉదయానే నిద్ర లేచి శుభ్రంగా స్నానం ఆచరించి విష్ణు పూజను చేయాలి 


దూప దీప నైవేద్యాలతో విష్ణు ని ఆరాధించాలి.


కొంత మంది రోజు అంత ఉపవాసం వుంటారు, కొంత మంది సూర్యాస్తమయం వరకు వుంటారు.


కొంత మంది సాత్విక ఆహారం భుజిస్తారు.


విష్ణు లేదా మరి ఏదైనా ఆలయంని దర్శించాలి.


భగవద్గిత , విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి.


కొంత మంది భక్తులు రాత్రి కూడా జాగరణ చేస్తారు.


2021 : 1 నవంబర్ 

Post a Comment

0 Comments