- కార్తీకపౌర్ణమి నాటి సాయంత్రం జ్వాలాతోరణం సిద్దమవుతుంది.
- శివాలయాలలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తు అయిన కర్రలు నాటుతారు.
- ఆ రెండిటిని కలుపుతూ అడ్డంగా మరో కర్ర నాటుతారు. అడ్డంగా కట్టిన కర్రకు ఎండుగడ్డి ని వేలాడే విధంగా చుడుతారు.
- చంద్రదర్శనం తరువాత ఆ గడ్డి పై నెయ్య పోసి మంట వెలిగిస్తారు.ఇది తోరణంలా వెలుగుతుంది.
- ఈ జ్వాలాతోరణం కింద నుంచి పార్వతీపరమేశ్వరులును మూడు సార్లు పల్లకిలో ప్రదక్షణముగా ఆలయం చుట్టూ నడిచి వెళ్తారు.
- తోరణంలో కాలిన గడ్డిని పశువుల మేత కలిపితే మంచిది అని భవిస్తారు.
- జ్వాలాతోరణంలో కాలిన గడ్డిని నుదుటన ధరిస్తే ఐశ్వర్యప్రదం.
0 Comments