- దీపావళికి ముందు రోజు అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు వచ్చేది నరక చతుర్దశి.
- ఈ రోజున శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు.
- ఈ రోజు నరకాసుర సంహారం జరిగినట్లు భాగవతం ద్వారా తెలుస్తుంది.
- ఇతను భూదేవి కుమారుడు అయినందున అయన పేరు మీద నరక చతుర్దశి ఏర్పడింది.
- ఈ రోజు నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి.
- ఈ రోజు నువ్వుల నూనెలో లక్ష్మి, నీటిలో గంగ ఆవహించి ఉంటారు అని శాస్త్ర వచనం.
- ఈ రోజు సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాని ఆచరిస్తే శరీరానికి దివ్యశక్తి కలుగుతుంది అని అంటారు.
- తెల్లవారుజామునే లేచి, నరకాసురుని దిష్టి బొమ్మ దహనం చేస్తారు.
- ఈనాటి భోజనంలో మినుములతో చేసిన పదార్ధాలను భుజించాలి అని శాస్త్రవచనం.
- ఈ నాటి సాయంకాలం, ఇంటి ముంగిట, ఆలయాలలోను దీపాలను వెలిగించాలి. దీపదానం చేయాలి.
- చాల ప్రాంతాలలో ఈ రోజు బాణాసంచా కాల్చే సంప్రదాయం కూడా ఉంది.
2021: 3 నవంబర్.
0 Comments