Ad Code

Responsive Advertisement

బలిపాడ్యమి

 


  • దీపావళి అమావాస్యతో ఆశ్వయుజమాసం ముగిసిపోతుంది.
  • కార్తీక మాసంలో మొదటి రోజు(పాడ్యమి) ఈ పండుగ జరుపుకుంటారు.
  • ప్రహ్లదుని మనుమడైన బలి చక్రవర్తి గొప్ప దాత.
  • అతిదానశీలత కారణంగా అపాత్రులకు , అనర్హులకు దానం చేయడం వల్ల, లోక వ్యవహారాలు దెబ్బతినసాగాయి. 
  • అందుకే బలిని నిరోధించడం కోసం శ్రీమహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిని పాతాళానికి తొక్కేశాడు.
  • నరక చతుర్దశి, దీపావళి, కార్తిక పాడ్యమి రోజులలో భూమిపైకి వచ్చి విహరించేందుకు బలికి అనుమతినిచ్చాడు. ఈ రోజులను బలిరాజ్యం అంటారు.
  • ఉత్తరాది రాష్ట్రాలలో బలిపాడ్యమి దినాన గోవర్ధన పూజ చేసే ఆచారం కనిపిస్తుంది. 
  • శ్రీకృష్ణుడు గోవర్జనోద్ధరణం చేసి ఇంద్రుని అహంకారాన్ని నాశనం చేసిన పర్వదినమిది అని విశ్వసిస్తారు. 
  • ఇంటి ముందు ఆవు పేడతో గోవర్ధన పర్వతాన్ని సిద్ధం చేసి, దానిపై రంగురంగుల పూలను అలంకరిస్తారు గోమాతను పూజిస్తారు.
  • ఉత్తరాది రాష్ట్రాలలో బలిపాడ్యమి రోజున అన్నకూటాలను నిర్వహిస్తారు. అన్నకూటం అంటే ఆహార పర్వతం. 
  • శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టడం కోసం అనేక రకాల పిండివంటలను, మిఠాయిలను తయారు చేసి, వాటితో ఆహార పర్వతాన్ని సిద్ధం చేస్తారు. 
  • వీటిని స్వామికి నివేదించి, గోధన పూజ చేస్తారు.

2021 తేదీ : నవంబర్ 5

Post a Comment

0 Comments