Ad Code

Responsive Advertisement

తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన ఆలయాలు

తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన ఆలయాలు



శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం - అన్నవరం

గోలింగేశ్వర  ఆలయం - రామచంద్రపురం

కపోతేశ్వర ఆలయం - రాజోలు

శ్రీ సోమేశ్వరస్వామి వారి దేవస్థానం - కోటిపల్లి

కోటిపల్లి క్షేత్రం

  • ఇక్కడ కోటి శివలింగాలు ఉన్నాయి.
  • గోదావరి నది ఇక్కడ సముద్రంలో కలుస్తుంది.
  • విష్ణువు వామనరూపుడై ఇక్కడ వెలిసాడు అని చెబుతారు
  • కార్తీక మాసంలో, శివరాత్రి  నాడు పుణ్య స్నానాలు ఆచరిస్తారు.
శ్రీ భీమేశ్వర ఆలయం - ద్రాక్షారామం.

  • పంచారామ ఆలయాలలో ఒక్కటి.
  • లింగం సగ భాగం నల్లగా, సగ భాగం తెల్లగా ఉంటుంది.
  • లింగం ఎత్తు 60 అడుగులు ఉంటుంది.
  • దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసాడు అని చెబుతారు.
  • ఇక్కడ వినాయక స్వామి తొండం కుడి చేతిమీదగా ఉంటుంది. కాశీలోని విశ్వేశ్వర ఆలయంలో కూడా ఇలాగే ఉంటుంది.
  • మహాశివరాత్రి నాడు ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం - అంతర్వేది
  • మాఘ మాసంలో కొద్దిరోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో కిరణాలు స్వామివారి పాదాలను తాకడం విశేషం.
  • మాఘ మాసంలో స్వామి వారి కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా జరుగుతాయి.
నరసింహ స్వామి ఆలయం - రాజమండ్రి.

ఉమామార్కండేశ్వర ఆలయం, సారంగడేశ్వర ఆలయం - రాజమండ్రి.

నూకాలమ్మ అమ్మవారు - అనకాపల్లి
  • 1611  లో ఆలయం నిర్మించారు 
పిఠాపురం 
  • పరమేశ్వరుడు కోడిపుంజు రూపంలో వెలసిన కుక్కుటేశ్వర క్షేత్రం
  • అష్ఠాదశ పీఠాలలో పురుహూతికా దేవి ఆలయం
  • ఇంద్రుడు నిర్మించిన ఐదు వైష్ణవ క్షేత్రాలలో ఒక్కటి 
  • దత్తాత్రేయుని ప్రధమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించిన పుణ్యస్థలి. 
శ్రీ వెంకటేశ్వర ఆలయం - అప్పనపల్లి 

మండపల్లి లో ఆలయాలు 

జగన్మోహిని చెన్నకేశవ ఆలయం - ర్యాలీ 

కుమారారామం
  • చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుడి కిరణాలూ ఉదయం స్వామివారి పాదాలమీద, సాయంత్రం అమ్మవారి పాదాల మీద పడటం విశేషం.
శ్రీ పళ్ళాలమ్మ దేవాలయం - వాసపల్లి.
  • ప్రతి ఏటా వైశాఖ పౌర్ణమి వెళ్లిన మంగళవారం పెద్ద తీర్థం జరుగుతుంది.తీర్థంకు ముందు రోజు జరిగే పెద్ద జాతర ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
  • అమ్మవారి ఉత్సవాలు నెలరోజుల పాటు వైభవంగా జరుగుతాయి.
కొప్పు లింగేశ్వరుడు - పలివెల 

ఆంధ్ర శబరిమల - ద్వారపూడి 

అయినవిల్లి - శ్రీ వినాయక స్వామి వారి ఆలయం.

  • స్వయంభు గణపతి క్షేత్రాలలో ఒక్కటి
  • దక్షప్రజాపతి యజ్ఞంకి ముందు గణపతిని పూజించినట్లు స్థల పురాణం
  • భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు ఈ క్షేత్రంలో విశేషంగా నిర్వహిస్తారు.

శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం - పెద్దాపురం
  • 17 వ శతాబ్దంలో గ్రామా దేవతగా వెలసింది.
  • ఆషాడ మాసంలో తిరునాళ్లు జరుగుతాయి.
శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం - లోవ.

శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం - రాజమండ్రి.

Post a Comment

0 Comments