- మాధవేశ్వరీదేవి ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడే 'ప్రయాగ'లో వుంది. ఈ ఆలయం అష్ఠాదశ శక్తిపీఠాలలో ఒక్కటి
- క్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది.
- దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది. దాని కింద ఒక ఉయ్యా ల.
- భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వేసి మొక్కుకోవాలి.
- గంగ, యమున, సరస్వతి నదుల కూడలి ప్రదేశం ప్రయాగ. ఈ నదుల సంగమాన్ని త్రివేణీ సంగమం అని అంటారు.
- ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు.
- కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు.
- ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తారు.
పూర్వం.. ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు. బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. అప్పటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటినుంచీ అక్కడివారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.
0 Comments