Ad Code

Responsive Advertisement

శ్రీ భూ వరాహ స్వామి వారి ఆలయం - తిరుమల

శ్రీ  భూ  వరాహ  స్వామి వారి ఆలయం  తిరుమల లో వెంకటేశ్వర స్వామి ఆలయం కి ఉత్తర దిక్కున , స్వామి వారి పుష్కరిణి ప్రక్కన వున్నది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ భూ వరాహ స్వామి వారు .

పురాణాలూ ప్రకారం తిరుమల కి అది వరాహ క్షేత్రం అని పేరు.బ్రహ్మపురాణం ప్రకారం వరాహ స్వామి వారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కి తిరుమల లో ఉండడానికి స్థలం ఇచ్చారు అని చెప్తారు .



దానికి కృతజ్ఞత గా వెంకటేశ్వర స్వామి వారు వరాహ స్వామి కి మొదటి దర్శనం మొదటి నైవేద్యం కి సమర్పించాలి ఆని అంటారు.

క్షేత్ర సంప్రదాయం ప్రకారం మొదట వరాహ స్వామి వారి ని దర్శించిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించాలి.

ఆలయ వేళలు : ఉదయం 5 .30  - 12 .00 , సాయంత్రం : 5 నుంచి 9  వరకు తెరిచి ఉంటుంది.

శ్రావణ మాసం లో స్వామి వారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments