- గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకుని చేసే వ్రతాన్ని సంకటహారవ్రతం అని అంటారు.
- ప్రతిమాసం కృష్ణపక్షంలో వచ్చే చవితి(చతుర్థి)ని సంకటహర చతుర్థి అంటారు. అంటే ఇది ప్రతి నెలలో పూర్ణిమ తరువాత మూడు లేదా నాలుగవ రోజు వస్తుంది.
- ఈ వ్రతం ఆచరిస్తే జరుగని పని లేదు.
- ఈ వ్రతాన్ని3,5,11 లేదా 21 నెలలు ఆచరిస్తారు.
- ఆ రోజు స్నానం చేసి గణపతిని పూజించి, ఎరుపు లేదు తెల్లని జాకెట్ పీఎస్ లో పసుపు, ఒక చిటెకెడు కుంకుమ ఉంచి గణపతి ముందు వుంచాలి.
- మూడు దోసిళ్ళు బియ్యాన్ని అందులో పోయాలి.
- ఆ తరువాత రెండు కజ్జురాలు, రెండు వక్కలు, దక్షిణ ఉంచిన తమలపాకులు అందులో ఉంచాలి.
- మనసులోని కోరికను మరోసారి తలుచుకుని మూటకట్టాలి.
- దానిని స్వామి ముందు ఉంచి దూపం వెలిగించి, టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి.
- గణపతి ఆలయానికి వెళ్లి చుట్టూ 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి.
నియమాలు :
- సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి పూజ చేయాలి.
- సూర్యాస్తమయం వరకు ఉడికిన పదార్థంగాని, ఉప్పు తగిలిన పదార్థంగాని తినకూడదు.
- పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు తినవచ్చు.
- చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రునికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి మాములుగా భోజనం చేయవచ్చు.
- నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
2021 : డిసెంబర్ 22.
0 Comments