Ad Code

Responsive Advertisement

శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం - యాగంటి



  • యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపిస్తారు.
  • ఈ  క్షేత్రంలో ప్రకృతి అందాలు భక్తులను అలరిస్తాయి.
  • ఈ పుష్కరిణికి 'అగస్త్య పుష్కరిణి' అనే పేరు.
  • మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం. 
  • ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని భక్తుల నమ్మకం.
  • ఈ క్షేత్రంలో ఉన్న ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తారు
  • ఈ క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు. ఇక్కడ అగస్త్యుడి తపస్సు చేస్తున్న సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించాయట. అప్పుడు అగస్త్యుడు ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట.

Post a Comment

0 Comments