Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం - షోలింగర్

 


  • తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగర్ ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. దీనికి 'తిరుక్కడిగై, కడిగాచలం' అనే ప్రాచీన నామాలున్నాయి.
  • ప్రహ్లాదుడి ప్రార్ధన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, యోగముద్రలో దర్శనమిచ్చిన నృసింహ స్వామి ఇక్కడ కొలువయ్యాడు.
  • ఈ యోగ నరసింహుణి సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్దిత్వాన్ని పొందాడనీ, ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్లయితే జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారనీ స్థలపురాణం చెబుతోంది.
  • అందుకే ఈ ప్రదేశాన్ని 'తిరుక్కడిగై' అని కూడా పిలుస్తారు. అంటే ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే నరసింహుడని అర్ధం.
  • వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్యం దేశాల్లో (క్షేత్రాల్లో) ఇదొకటి
  • ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో బ్రహ్మతీర్ధం అనే పుష్కరణి ఉంది. 108 తీర్థాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయంటారు. 
  • దీని ఒడ్డున వరదరాజస్వామి ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలోని మరో కొండ మీద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆ గుడిలో హనుమంతుడు కూడా యోగముద్రలోనే కనిపించడం విశేషం.
  • సుమారు 230 మీటర్ల ఎత్తయిన కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 1300కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 
  • ప్రధాన ఆలయంలో యోగ నరసింహ స్వామి మూలవిరాట్ ఉంటుంది. యోగముద్రలో కూర్చున్న నారసింహుడి కాళ్ళకు యోగ బంధం (పట్టీ) ఉంటుంది. 
  • ఆయన దేవేరి అమృతవల్లి అమ్మవారి మందిరం ప్రధాన ఆలయానికి కుడివైపు ఉంటుంది.
  • ఈ ఆలయానికి కార్తీక మాసంలోని శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. చక్ర తీర్ధంలో స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. 
  • మానసిక సమస్యలతో, నయంకాని వ్యాధులతో బాధపడేవారు, నిరాశ, నిస్పృహలకు గురైనవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి, ముక్తిప్రదాత అయిన స్వామిని పూజిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం.

Post a Comment

0 Comments