పంచారామాల్లో భీమవరం ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైనది. ఈ ఆలయంలో స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమారామం అని, స్వామి సోమేశ్వరుడు అనే పేర్లు వచ్చాయి.అమ్మవారు పార్వతి దేవిగా ఇక్కడ కొలువుతీరింది.
ఈ ఆలయంలో స్వామి చంద్రకళను అనుసరించి పూర్ణమినాడు స్పటికలింగం వలె తెల్లగా కనిపించి, క్రమంగా వన్నె తగ్గుతూ, అమావాస్య నాటికీ గోధుమ రంగులో దర్శనం ఇస్తాడు. ఈ క్షేత్రంలోని సోమేశ్వరుని పరమశివుని పంచ ముఖలలోని సద్యోజాత స్వరూపంగా చెబుతారు.
ఈ ఆలయం 10వ శతాబ్దంలో చాళుక్య రాజు పునరువుద్దరించాడు. తరువాత చాల సార్లు పునర్ఉద్ధరణ జరిగింది.
గర్భాలయంలో రెండు అడుగుల ఎత్తుగల పాన వట్టం పై మూడు అడుగుల ఎత్తులో సోమేశ్వర లింగం దర్శనమిస్తుంది.పార్వతి అమ్మారు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. ప్రధానాలయం రెండవ అంతస్తులో అంటే స్వామి వారి గర్భాలయ పై భాగంలో అన్నపూర్ణాదేవి ప్రతిష్ఠురాలు అయింది.
ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారు, శ్రీరాముడు, కుమారస్వామి, నవగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయ పుష్కరిణిని సోమా గుండం పుష్కరిణి అని అంటారు.
ఆలయ వేళలు :
ఉదయం 5 నుండి 11 వరకు
సాయంత్రం 4 నుండి 8 వరకు.
పండుగలు :
మహాశివరాత్రి, దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
దర్శించవలసిన ఆలయాలు :
ద్వారకా తిరుమల
పిఠాపురం,ద్రాక్షారామం
భద్రాచలం.
ఎలా వెళ్ళాలి :
భీమవరం రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో, భీమవరం బస్టాండ్ నుండి 1 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.
0 Comments