Ad Code

Responsive Advertisement

శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి ఆలయం - అమరావతి

కుమారస్వామి చేత చేధింపబడిన తారకాసురుని మెడలోని అమృతలింగపు మొదటి భాగం అమరారామం. ఈ ఆలయం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉంది.



ఇక్కడ స్వామి వారికీ అమరేశ్వరుడు అని పేరు. అమ్మవారు బాల చాముండేశ్వరిగా పిలుస్తారు. ఇక్కడ స్వామి వారిని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అమరేశ్వర స్వామిని పరమశివుని అఘోరముఖ రూపంగా చెబుతారు.

తారకాసురుని చేతిలో పరాజయం పొందిన అమరులు(దేవతలు) శివుని సూచన మేరకు ఈ ప్రదేశం లో ఉన్నారు అని అందుకే ఈ క్షేత్రం అమరపురిగా, అమరావతిగా పిలువబడింది అని  చెబుతారు.

మరొక కధనం ప్రకారం ఇక్కడ దేవతలు ఒక్క వట వృక్షాన్ని( మర్రి చెట్టు) నాటారు అని అమరులు చేత నాటబడిన ఆ వటవృక్షం అమరవటంగా పిలువ బడేది అని , ఇంద్రుడు మర్రిచెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించాడు అని అందుకే స్వామి వారిని అమరేశ్వరుని పిలవబడ్డారు అని తెలుస్తుంది. 

4 వ శతాబ్దంలో అమరేశ్వరుడు పూజలు అందుకున్నట్లు చరిత్రకారులు ద్వారా తెలుస్తుంది.

తూర్పుముఖంగా వున్నా అమరేశ్వరాలయంలో మూడు ప్రాకారాలు, నాలుగు గోపురాలతో కుడి ఉంది. అమరేశ్వరుని ప్రధాన ఆలయం మూడవ ప్రాకారంలో ఉంది.

గర్భాలయంలో ఎనిమిది అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు కలిగిన పానవట్టం పై అమరేశ్వరస్వామి తొమ్మిది అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడు.స్వామి వారి అభిషేకం కోసం గర్భాలయంలో ఎడమ వైపున మెట్లు ఉన్నాయి. ఆలయ ప్రాంగణములోనే అమ్మవారి ఆలయం ఉంది.

ఆలయ వేళలు 

ఉదయం 6 నుండి రాత్రి  9  వరకు.

మధ్యాహ్నం 1కి  మూసి ,4  గంటలకు తెరుస్తారు.

సాంప్రదాయ దుస్తులతో మాత్రమే స్వామి వారిని దర్శించాలి.

ముఖ్య మైన పండుగలు :

మహాశివరాత్రి, దసరా నవరాత్రులు వైభావంగా జరుగుతాయి.

గుంటూరు లో వసతి సౌకర్యం ఉంటుంది.

చుట్టూ పక్కల చూడవలసిన ఆలయాలు :

  • 1800 సంవత్సరాల పురాతమైన వేణుగోపాల స్వామి వారి ఆలయం
  • సాయిబాబా ఆలయం
  • లలిత పీఠం
  • బౌద్ధ స్తూపం.

ఎలా వెళ్ళాలి :

విజయవాడ నుండి 82 కి.మీ, గుంటూరు నుండి 35 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం.


Post a Comment

0 Comments