Ad Code

Responsive Advertisement

ఆలయంలో దైవానికి ఎదురు నిలబడి నమస్కరించకూడదా ?




ఆలయాల్లో దేవుడి విగ్రహాలను దర్శించుకునేటప్పుడు ఓ పక్కగా నిలబడి నమస్కరించాలి. స్వామివారికీ, ఎదురుగా ఉండే ఆయన వాహనానికీ మధ్యలో నిలబడకూడదన్నది నియమం. ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో పలు మంత్రశక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం కాబట్టి ఎదురుగా నిలబడకూడదనీ చెబుతారు. దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్టును ప్రతిష్ఠించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తూ, గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతోపాటు మంత్రబలం కూడా ఉంటుంది. మరి కొన్ని ఆలయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలబడితే కిరణాలు మూలవిరాట్టు దగ్గరకు వెళ్లలేవు… ఇలా రకరకాల కారణాలతో ఆలయంలో దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదని చెబుతారు. పురాణాల ప్రకారం శివాలయంలో లింగాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన తర్వాతే లింగానికి నమస్కారం చేయాలి.

Post a Comment

0 Comments