ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమకు ముగిసేట్లుగా మూడురోజులపాటు తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు జరుగుతాయి .
చైత్రశుద్ధ త్రయోదశి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి ఆలయానికి నైరృతి మూలలో వున్న వసంత మండపానికి వేంచేయగా వసంతోత్సవ అభిషేకాలు నివేదన ఆస్థానాలు జరుగుతాయి . పిదప ఆలయాన్ని చేరుకొంటారు.
రెండవ రోజు శ్రీ మలయప్పస్వామికి బంగారు రథోత్సవం జరిగిన తర్వాత మళ్లీ ముందురోజు మాదిరే వసంతమండపంలో వసంతోత్సవం జరుగుతుంది.
మూడవరోజు శ్రీ మలయప్పస్వామితోపాటు, వేర్వేరు పల్లకీలలో రుక్మిణీ శ్రీకృష్ణులు, శ్రీ సీతారామలక్ష్మణులు కూడా వసంతమండపానికి ఊరేగింపుగా వెళ్ళి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని ఆ సాయంత్రం ఆలయానికి చేరుకొంటారు.
ఆర్జితంగా జరిగే ఈ వార్షిక వసంతోత్సవాల్లో భక్తులు పాలుపంచుకోవచ్చు. వసంతోత్సవం చేయించిన భక్తులకు తీవ్రమైన రోగాలు తగ్గి, ఆరోగ్యం సిద్ధిస్తుంది.
0 Comments