- అగ్నిసాక్షిగా పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్న భావన దీపారాధనతో కలుగుతుంది.
- ఏ శుభ కార్యారంభంలోనైనా దీప ప్రకాశనం చేయడం మన ఆచారం.
- సకల సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి జ్యోతిస్వరూపిణి.
- దీపారాధన కోసం ఆవునెయ్యి ఉత్తమం, నువ్వులనూనె మధ్యమం, ఇప్పనూనె అధమం అని చెప్పారు.
- దీపారాధన చేయడమంటే మనలోని అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఆహ్వానించడమే.
- షోడశోపచారాల్లో దీప సమర్పణ ప్రధానమైనది.
- దీపంలో కనిపించే నీలం, 'పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు.
0 Comments