భారతదేశం ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. దేశంలో దర్శనీయ పుణ్యక్షేత్రాలలో ఎక్కువ మంది చెప్పే పేరు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ). ఈ సంవత్సరం (2022లో) ప్రజలకు అత్యంత ఇష్టమైన తీర్థయాత్ర గమ్యస్థానంగా వారణాసి నిలిచింది.
ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
తెలుగు వారి కలియుగదైవం వెంకటేశ్వరుడి నిలయం తిరుమల తిరుపతి సైతం భక్తుల గమ్యస్థానంగా నిలిచింది.తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ఆ తరువాత ఒడిశాలోని పూరీ, పంజాబ్ లోని అమృత్‌సర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లను కూడా అత్యధిక ప్రజలు తమకు ఇష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా నిలిచాయి.
పైన పేర్కొన్న నగరాలతో పాటు మహారాష్ట్రలోని షిర్డీ, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, మహాబలేశ్వర్ (మహారాష్ట్ర)లతో పాటు తమిళనాడులోని మధురై కూడా భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో నిలిచాయి.
ఆగస్టు నెలలో తీర్థయాత్రలు అధికంగా చేశారు. దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాలలో 2022 ఆగస్ట్ నుంచి అక్టోబర్ నెలల మధ్య అధిక డిమాండ్ ఉంది.
0 Comments