Ad Code

Responsive Advertisement

మహారాష్ట్ర ఆలయాలలో కరోనా ఆంక్షలు



మహారాష్ట్రలోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు అయ్యాయి. రాష్ట్రములోని చాలా దేవాలయాల్లో కరోనా ఆంక్షలు మొదలు పెట్టింది. మాస్క్ ను ధరించడం తప్పని సరి చేసింది.

షిర్డీలోని సాయిబాబా ఆలయం, శనిసింగనాపూర్ ఆలయంలో కరోనా ఆంక్షలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.

తుల్జాభవానీ దేవాలయంలో మరి కొన్ని రోజులలో ఆంక్షలు మొదలు కానున్నాయి. 

నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయంలో ఖచ్చితంగా మాస్క్‌లను ధరింపజేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు, ఆలయ సిబ్బంది ముందు మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. 

అక్కల్‌కోట్‌లోని శ్రీ స్వామి సమర్థ ఆలయంలో కూడా మాస్క్‌లు తప్పని సరి చేశారు. భక్తులు మాస్క్ ధరించి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని ఆలయ నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు.

నాసిక్ జిల్లాలోనే సప్తశృంగి దేవి ఆలయంలో నో మాస్క్, నో ఎంట్రీ అనే నిబంధన కూడా అమలులోకి వచ్చింది.

కొల్హాపూర్‌లోని అంబాబాయి ఆలయంలో కూడా మాస్కులను తప్పని సరి చేశారు. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉద్యోగులు, పూజారులు మాస్క్‌లలో మాత్రమే ఆలయంలోకి రావాలని సూచించారు. 

Post a Comment

0 Comments