తెలంగాణలోని ప్రముఖవైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజల కోసం తపాలాశాఖ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అంతరాలయంలో తమ గోత్రనామాలతో అర్భనలు చేయించడానికి భక్తులకు అవకాశం కల్పించింది. ఆసక్తి గల భక్తులు రూ.210లు సేవా రుసుముగా చెల్లిస్తే వారిపేరుతో అర్భన చేయడంతో పాటు దేవాదాయ శాఖ సహకారంతో స్పీడ్‌పోస్టులో ప్రసాదం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తపాలా శాఖఅధికారులు తెలిపారు. ప్రధానంగా భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి ఆలయాల్లో జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి(ముక్కోటి ఏకాదశి) రోజున గోత్రనామంతో పూజలు నిర్వహించేందుకు భక్తులు పోస్టాఫిసులో డిసెంబర్ 31 వరకు పేరు నమోదు చేసుకోవచ్చు.
0 Comments