సర్వదర్శనం భక్తులకు.. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 92 కౌంటర్లు ద్వారా ఏకాదశి దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు. ఈ టోకెన్ల జారీ ప్రక్రియ జనవరి 1వ తేది నుంచి ప్రారంభిస్తారు.
డిసెంబర్ 29 నుండి జనవరి 3వ తేది వరకు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపు రద్దు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అంటే జననరి 2, 3వ తేదిలలో సిఫార్సు లేఖలను స్వీకరించరు.
ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు స్వర్ణ రథం ఉరేగింపు, ద్వాదశి పర్వదినం రోజున వేకువజామున 4 గంటలకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారు.
పది రోజులు పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు.
జనవరి 2న ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.. . టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి.
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు 8 చోట్ల తిరుమలలో 1 ఏర్పాటు..
తిరుపతిలో టోకెన్స్ ఇచ్చే ప్రదేశాలు
1) భూదేవి కాంప్లెక్స్
2) శ్రీనివాసం
3)గోవిందరాజు స్వామి సంత్రం
4) MR పల్లి Z.P.హైస్కూల్
5) మున్సిపల్ ఆఫీసు
6) రామచంద్ర పుష్కరిణి
7) రామానాయుడు స్కూల్
8) జీవకోన Z.P.హైస్కూల్
9) తిరుమల – కౌస్తభం
0 Comments