Ad Code

Responsive Advertisement

శ్రీవారి భక్తులకు అలర్ట్ - మండూస్ తుఫాన్ ప్రభావంతో శ్రీవారి మెట్టు మార్గం మూసివేత

 శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో శ్రీనివాసుడి భక్తులకు అవస్ధలు తప్పడం లేదు.


 ప్రతి నిత్యం స్వామి వారి సన్నిధిలో దాదాపుగా డెభై వేల నుండి ఎనభై వేల మంది వరకూ భక్తులు దర్శించుకుంటారు. ఇందులో దాదాపు నలభై శాతం మంది భక్తులు నడక మార్గం గుండానే చేరుకుంటారు. 


మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో ఎడ తెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోవైపు శ్రీవారి మొట్టు మార్గంలో అధికంగా వర్షపు నీరు వస్తుండడంతో అప్రమత్తంమైన టిటిడి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీవారి నడక మార్గం తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. వర్షం పూర్తిగా తగ్గే వరకూ భక్తులకు శ్రీవారి నడక మార్గం గుండా తిరుమలకు అనుమతి‌ లేదని వెల్లడించింది.

Post a Comment

0 Comments