Ad Code

Responsive Advertisement

షిరిడి సాయిబాబా ఆలయం - షిరిడి.

భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలలో సాయిబాబా ఆలయం ఒకటి.ఇది దేశంలోనే ఎక్కువ మంది దర్శించే ఆలయాలలో ఒక్కటి. ఈ ఆలయం మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా లో షిర్డీ అనే ఊరిలో ఉంది.



సాయిబాబా షిర్డీ నేల మీద 60 సంవత్సరాలు జీవించడం వల్ల ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. సాయిబాబా వారు చేసిన బోధనలలో ప్రముఖమైనది " సబ్ క మాలిక్ ఏక్" అంటే అందరికి భగవంతుడు ఒక్కరే.

1917 లో భూటి అనే గొప్ప ధనవంతుడు  బాబా యొక్క ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మాణం మొదలు పెట్టాడు. ఇక్కడ మురళీధరుని విగ్రహం పెట్టాలని సంకల్పించారు. అనుకోని కారణాల వల్ల అదే ప్రదేశంలో  బాబా వారి సమాధిని చేయడం జరిగింది. అందుకే దీనిని సమాధి మందిరం అని అంటారు. అంటే బాబాయే మురళీధరుడు అని భక్తులు భావిస్తారు.

1917 మొదలైన మందిర నిర్మాణం 1922  లో పూర్తి అయింది. 

బాబా వారి జన్మ స్థలం, తల్లితండ్రులు, వారు ఎప్పుడు జన్మించారు అనేది ఎవరికీ తెలియదు.

1854 లో సుమారు పదహారు యేండ్ల బాలుడిగా షిర్డీ కి వచ్చిన బాలయోగి. కొని సంవత్సరాల పాటు షిర్డీ వదిలి ఎక్కడికో వెళ్లిపోయి, మళ్ళి చాంద్ పాటిల్ పెళ్లి బృందం తో 1858 లో  షిర్డీకివచ్చాడ.   

బాలయోగి ని చుసిన ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి రండి "సాయి" అని పిలవడంతో అయన ని అందరు సాయిబాబా గా పిలువా సాగారు.

  • సాయి అంటే భగవంతుని పేరు, బాబా అంటే తండ్రి అని అర్ధం.
  • బాబా వారు యాప చెట్టు కింద ధ్యానం చేసుకునేవారు. కొంత మంది భక్తులు అక్కడే బాబాను పూజించుకునేవారు.
  • భక్తుల కోరిక మేరకు బాబా వారు ఒక్క పాడుపడిన భవంతిలో నివాసం వుండే వారు.దీనిని అయన " ద్వారకామాయి" అని పిలిచే వారు.
  • ద్వారకామాయి అంటే నాలుగు ద్వారాలు కలది అని అర్ధం. కుల,మత, వర్ణ,వర్గం అనే బేధం   ఏమి లేకుండా ఎవరైనా రావచ్చు అని చెప్పేవారు.
  • బాబా వారు చాల సాధారణ జీవితం గడిపేవారు. బిక్ష చేసి జీవించేవారు.
  • భక్తులకు ఒక గురువు వల్లే భోదలు చేసేవారు. అపుడపుడు వైద్యం చేసేవారు. ఆయను దర్శించుకున్న భక్తులు శాంతి పొందేవారు.
  • 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున బాబా మహా సమాధి చెందారు.

ఇప్పుడు శ్రీ సాయిబాబా సంస్థాన్ మందిర బాధ్యతలు నిర్వహిస్తుంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ షిర్డీ గ్రామా అభివృద్ధికి భాగస్వామి అవుతుంది. సంస్థాన్  వారు మరి ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

ఆలయాల వేళలు: ఉదయం 4  నుండి రాత్రి 11 వరకు.

స్పెషల్ అభిషేక పూజలు రోజుకు మూడుసార్లు చేస్తారు.

ఉదయం 7  నుంచి  8 వరకు
ఉదయం 9 నుంచి  10 వరకు
ఉదయం  11 నుంచి 12 వరకు.

సత్యనారాయణ స్వామి పూజ రోజుకు మూడుసార్లు చేస్తారు

ఉదయం 7  నుంచి  8 వరకు
ఉదయం 9 నుంచి  10 వరకు
ఉదయం  11 నుంచి 12 వరకు.

పూజలు - ఆచారాలు :

4.15 - భూపాలీ
4.30 - 5.00 కాకడ ఆరతి అంటే ఉదయం ఆరతి.
5.05 - మంగళ స్నానం
7.00 - 12.00 - సత్యనారాయణ పూజ
12.00 - మధ్యాహన ఆరతి 
సూర్యాస్తమయ  సమయంలో - ధూప్ ఆరతి అంటే సాయం సంధ్య ఆరతి 
10.30 - శేజ్ ఆరతి అంటే రాత్రి ఆరతి.

ప్రతి గురువారం రాత్రి 9.15  గంటలకు బాబా వారికీ "పల్లకి సేవ" నిర్వహిస్తారు. సమాధి మందిరం నుండి ద్వారకామాయి మీదగా  చావడి వరకు మేళతాళాలతో అత్యంత భక్తి శ్రద్ధల తో ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ముఖ్యమైన పండుగలు

శ్రీ రామనవమి
గురు పూర్ణిమ
విజయదశమి 

ఆలయం   దగ్గర చూడవలసినవి :

ఖండోబా ఆలయం : ఖండోబా అనగా శివుని అవతారం.ఇక్కడ ఆలయ పూజారి మహల్సాపతి బాబాను రండి సాయి అని పిలిచింది.



సమాధి మందిరం : బాబావారి మహా సమాధి ని భక్తులు దర్శించుకునే మందిరం.

గురుస్థానం : యాప చెట్టు కింద బాబా వారు ధ్యానం చేసుకున్నది ఇక్కడే. ఇపుడు దానికి గుర్తుగా ఒక శివలింగం ప్రతిష్టించారు.

ద్వారకామాయి : సమాధి మందిరం పక్కన ఉండేది ద్వారకామాయి. బాబావారు ఇక్కడే ఉండేవారు, ఇక్కడ ధుని కూడా ఉంది.

చావడి : ద్వారకామాయి పక్కన ఉండేది చావడి.రోజు మర్చి రోజు బాబా ఇక్కడ నిద్రించేవారు.

లెండి బాగ్: బాబా వారు స్వయంగా నిర్మించిన ఉద్యానవనం. ఇక్కడ మనకు నందాదీప్ కూడా ఉంది.

ఇంకా బాబా భక్తుల ఇల్లు, వాళ్ళ సమాధులు దర్శినాయ స్థలాలు.



సాయిబాబా సమాధి మందిరానికి సుమారు 700 మీటర్ల దూరంలో ప్రసాదాలయం వుంది.

ప్రసాదాలయం వేళలు : ఉదయం 10  నుంచి రాత్రి 10 ,11  వరకు విరామం లేకుండా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.   

ఎలా వేలాలి :

షిర్డీకి ఇప్పుడు విమానాశ్రయం అందుబాటులో ఉంది.

సాయినగర్(షిర్డీ రైల్వే స్టేషన్) అందుబాటులో ఉంది, లేకపోతె మన్మాడ్ లో దిగి అక్కడ నుండి షిర్డీ రోడ్ మార్గం ద్వారా చేరుకోవచ్చు.

బస్సు సౌకర్యం అన్ని ప్రదేశాల నుండి అందుబాటులో ఉంది.

ముందుగా రూమ్ మరియు దర్శనం  www.sai.org.in  నుండి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు.





Post a Comment

0 Comments