-
అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పద్మిని ఏకాదశి అని పేరు.
-
ఈ ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మ దేవుడు నారద మహర్షికి వివరించాడు.
-
ఈ ఏకాదశికి ముందు రోజు ఉపవాసాన్ని ఆరంభించాలి.
-
మినపప్పు, సెనగపప్పు, పాలకూర, తేనె, ఉప్పు వాటిని తినకూడదు. ఇతరుల ఇంట్లో భోజనం చేయకూడదు.
-
దశమి రోజు ఒక పూట మాత్రం భోజనం చేసి నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి.
-
ఏకాదశి రోజు వీలైతే నది స్నానం చేయాలి.తరువాత విష్ణు ఆలయాన్ని దర్శించాలి
-
విధివిధానంగా రాధాకృష్ణులను పూజించాలి.
- ఈ రోజు వ్యర్ధ సంభాషణం చేయరాదు
- విష్ణు మహిమలను శ్రవణం చేయాలి
- ఈరోజు మంచినీరు కూడా తాగరాదు, ఉండలేనివారు నీరు లేదా పాలు తాగవచ్చు.
- ఈరోజు జాగారం చేసిన వారికీ రాజసూయ యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది.
- ఈ ఏకాదశిని విధివిధానంగా పాటించిన వాడు సకలతీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
- ఏకాదశి తరువాత రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి జలకలశం దానం చేయాలి.
- ఈ ఏకాదశి గురించి వినినా, చదివినా మానవుడు అనంత లాభాన్ని పొంది చివరకు విష్ణు ధామానికి చేరుతాడు.
2020 తేదీ : సెప్టెంబర్ 27.
0 Comments