ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరుజిల్లాలో కుంభకోణం పట్టణం నుండి సుమారు 7కిమీ ల దూరంలో వున్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో ఉంది.
ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే శివుడు పార్వతి కలిసి శివలింగకారంలో ఉంటారు. దీంతో ఈ దేవాలయం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ది చెందినది.
శివున్ని పెళ్లాడేందుకు పార్వతీదేవి ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. క్రమంగా తపస్సు తీవ్ర రూపం దాల్చడం మాత్రమే కాదు ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది.ఇది గమనించిన శివుడు పార్వతీ దేవికి ప్రసన్నుడవుతాడు. కానీ ప్రత్యక్షం కాలేదు.దీంతో పార్వతీ దేవి మరింత కఠినంగా తపస్సును కొనసాగిస్తుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్నిరూపంలో దర్శనమిస్తాడు. ఆ పరమశివున్ని అగ్ని రూపంలో దర్శించిన పార్వతి కాస్త కూడా జంకకుండా ఆ అగ్నిరూపాన్నే కౌగిలించుకుంటుంది. అయితే ఆమె తపస్సు చేసిన స్థలంలోనే ఈ ఆలయం వెలసింది.
ఈ విధంగా ఆది శక్తియైన పార్వతి దేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది. అయితే ఇక్కడి శివలింగం ఎలా ఉంటుందంటే పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది.
శక్తివనేశ్వర ఆలయానికి నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఈ ఆలయానికి ఇంకో విషేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఈ ఆలయానికి ఎవరైనా ప్రేమికులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వారితోనే వివాహంభాగ్యాన్ని ప్రసాదిస్తాడంట.
ఇక్కడి వచ్చే భక్తులు శివుని అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తుండడంతో వారి కోరికలు తీరుస్తారని ప్రతీతి.
ఆలయ వేళలు :
ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు
సాయంత్రం 4.30 నుండి రాత్రి 8.00 వరకు
9.00 - 9.30 - కలై సంధి పూజ
11.30 - 12.00 - ఉచి కాలం పూజ
5.30 - 6.00 - సాయరట్చి పూజ
8.00 - 8.30 - అర్థ జామమ్ పూజ
ఎలా వెళ్ళాలి :
కుంభకోణం నుండి 7 కిమీ దూరంలో ఉంది
0 Comments