ఆలయాల్లోని విగ్రహాన్ని అర్చకులు తప్ప వేరెవ్వరూ తాకకూడదు.అర్చకులకు తాకకూడని సమయాలు నియమ నిబంధనలు చాలానే ఉన్నాయి.వారు న్యాసపూర్వకంగా తమ శరీరావయవాల్లోకి పరమాత్మ శక్తిని ఆవాహన చేసుకోవడం ద్వారా తమను తాము పవిత్రీకరించుకుంటారు.అనంతరం దేవతా విగ్రహాలు తాకి ఆయా సేవలు చేస్తారు.
ఆలయానికి వెళుతున్నామంటేనే ఆగమ సంప్రదాయాలను గౌరవిస్తున్నామని అర్థం.మన సంప్రదాయాలను మనమే అవహేళన చేసుకోకూడదు. అలాగే జ్యోతిర్లింగ క్షేత్రాల వంటి ఆలయ నియమాలు అనుమతించిన చోట మినహా మిగిలిన చోట దేవతా విగ్రహాలను తాకే ప్రయత్నం చేయడం మానుకోవాలి.
ఆలయాల్లో పవిత్రతకు భంగం వాటిల్లే ఎలాంటి పనులను చేయకూడదు.
0 Comments