- గర్భగుడిలో నెలకొని ఉన్న విగ్రహాన్ని మూలమూర్తి అంటారు.
- ప్రధాన బింబం, మూల విగ్రహం, మూల విరాట్టు, మూలవర్లు ఇలా పలు పేర్లతో పిలవటం వాడుక.
- మూలవిరాట్టు అభయాన్నిస్తూ కనిపిస్తే సౌమ్యమూర్తి అని అంటారు.
- విష్ణువు, లక్ష్మి, రాజరాజేశ్వరీ, రాముడు, కృష్ణుడు, సరస్వతి వీరంతా సౌమ్య మూర్తులు.
- కూర్చుని, నిల్చుని, చుట్టూ దేవతలతో ఉన్న మూలవిరాట్టును భోగమూర్తి అంటారు.
- ఉమా మహేశ్వరులు, లక్ష్మీనారాయణ, సీతారాములు రాధాకృష్ణులు వీరంతా భోగమూర్తులు.
- తపస్సు చేసుకుంటూ కనిపించే మూలవిరాట్టును యోగ మూర్తి అంటారు.
- యోగనరసింహ స్వామి, దక్షిణమూర్తి యోగమూర్తులు.
- ఉగ్రమైనముఖంతో, తీక్షణమైన రీతిలో ఉండేవి ఉగ్ర మూర్తులు.
- ఉగ్రనరసింహ మూర్తి, వీరభద్రుడు,కాళీ, భైరవుడు, దుర్గా వీరంతా ఉగ్ర మూర్తులు.
- సౌమ్యమూర్తు లను దర్శిస్తే మంచి కోరికలు,భోగమూర్తుల దర్శనంతో ఐశ్వర్యం, భోగం,వివాహం వంటి కోరికలు, యోగమూర్తి దర్శనంతో విద్య-జ్ఞానం, ఉగ్రమూర్తుల దర్శనంతో విజయం, శత్రునాశనం వంటి కోరికలు నెరవేరుతాయని ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి.
శివాలయంలో శివలింగ దర్శనంతో ఐహిక సుఖాలతో పాటు పార లౌకిక కామ్యాలు అంటే మోక్షం కూడా లభిస్తుంది.
విగ్రహాన్ని పాదాలనుండి మొదలు పెట్టి ఒక్కో భాగాన్ని దర్శిస్తూ పైకి రావాలి.పాద దర్శనం - పాపనాశనం, కటిదర్శనం - కర్మనాశనం, కంఠదర్శనం - వైకుంఠసాధనం, ముఖదర్శనం ముక్తిదాయకం, కిరీటదర్శనం - కీర్తిదాయకం, సర్వాంగ దర్శనం - సర్వపాపవిమోచనం , శిఖరదర్శనం వల్ల చింతలు తీరుతాయని ఆగమశాస్త్ర చెబుతోంది.
0 Comments