Ad Code

Responsive Advertisement

నాలుగు యుగాలు పరిమాణం (మత్స్య పురాణం)

మత్స్య పురాణంలో చెప్పిన నాలుగు యుగాలు

కృతయుగం 
  • నాలుగువేల దివ్య వర్షాలు కృతయుగం.పరిమాణం నాలుగు వందల దివ్య వర్షాలు. 
  • ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలతో అధర్మం పావు భాగం కన్నా చాలా తక్కువగా వుంటుంది.
  • ఈ యుగంలో మానవులందరూ స్వధర్మనిరతులుగా వుంటారు.
  • విప్రులు విప్రధర్మాన్ని , క్షత్రియులు క్షత్రియధర్మాన్ని, వైశ్యులు వైశ్య ధర్మాన్ని, శూద్రులు శూద్ర ధర్మాన్ని ఆచరిస్తూ సజ్జనులుగా ఉంటారు .
  • సత్యం, శౌచం, ధర్మం వృద్ధి చెందుతుంటుంది. 
  • సజ్జనులు ఆచరించే కర్మల్ని అందరూ మెచ్చుకుని తాము కూడా ఆచరించేవారు. 
  • నీచ కర్మలు ఆచరించేవారు కూడా తమ తప్పుల్ని తెలుసుకొని పరివర్తన పొందేవారు. 
  • ఈ విధంగా కృతయుగంలో అందరూ సన్మార్గులు గానే వుండేవారు.
త్రేతాయుగం 
  • మూడు వేల దివ్య వర్షాల పరిమాణం కలది త్రేతాయుగం. పరిమాణం మూడువందల దివ్య వర్షాలు.
  • ఈ యుగంలో మూడు పాదాలతో ధర్మం నడుస్తుంది. 
  • రెండు పాదాలకన్నా కాస్త తక్కువగా అధర్మం వుంటుంది. 
  • శాస్త్రాధ్యయనం. సత్యం బలం, క్షమ, ధర్మం అనే వాటిని ఆ యుగంలో వున్నవారు ఆచరిస్తూ ఉంటారు.
  • వీటివల్ల ఆ యుగంలో ప్రజలు దుర్బలులుగా మారుతారు. 
  • ఈ విధంగా త్రేతాయుగం ఉంటుంది.
ద్వాపరయుగం
  • రెండువేల దివ్య వర్షాలు ద్వాపరయుగ పరిమాణం రెండు వందల దివ్య వర్షాలు.
  • ఈ యుగంలో మానవులంతా రజోగుణ వంతులై అర్థానికి ప్రాధాన్యత నిస్తారు. 
  • చాలా వరకూ క్షుద్రులు, మోసగాళ్ళు వుంటారు.ఈ
  • ఈయుగంలో ధర్మం రెండుపాదాలతో వుండగా అధర్మం మూడు పాదాలకన్నా కాస్త తక్కువగా వుంటుంది.
  • దీనివల్ల క్రమంగా కలియుగం వచ్చేసరికి ధర్మం క్షయమవుతుంది.
  • ద్వాపరయుగం ముగిసేనాటికి క్రమక్రమంగా బ్రాహ్మణుల మీద, వైదిక ధర్మం మీద ఆసక్తి తగ్గుతుంది. 
  • అందరూ వ్రతాల్ని, ఉపాసనల్ని  విడిచిపెడుతారు.
కలియుగం 
  • అన్ని యుగాల కన్నా కలియుగం చాలా క్రూరంగా ఉంటుంది.
  • ఒక వేయి దివ్య వర్షాలు కలియుగ పరిమాణం. వంద దివ్య సంవత్సరాలు ఈ యుగానికి సంధ్యాకాలం.
  • ఈ యుగంలో ఆధర్మం నాలుగు పాదాల్లో వుంటుంది. 
  • ధర్మం ఒక పాదం కన్నా కాస్త తక్కువగా వుంటుంది.
  • మానవులందరూ కాముక ప్రవృత్తితో వుంటారు. 
  • తమోగుణ ప్రధానులై  నాస్తికులుగా  మారి నేనే సర్వసం అన్న అహంకారంతో వుంటారు. ఆశ్రమధర్మాలన్నీ వ్యత్యస్తంగా మారిపోతాయి. 
  • యుగం చివరి నాటికి అసలు వర్ణవ్యవస్థ వుంటుందా లేదా అనిపిస్తుంది.

Post a Comment

0 Comments