Ad Code

Responsive Advertisement

వ్యాస భగవానుడు చెప్పిన ధర్మాలు (కుర్మా పురాణం) (6/6)

జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి

  • పరమాత్మకి నివేదన చేయని నువ్వుల పొంగలి, పాయసం, ఆవుపాలు దేవతలకు బలిగా సమర్పించిన అన్నం,గంజి,కుడితి, కదంబం, వెలగ, జువ్వి - వీటిని స్వీకరించకూడదు.
  • నెయ్యి ద్వారా తయారు చేసిన పదార్థాలు, దేవధాన్యం, నువ్వులతో చేసిన పదార్థాలు, తెలకపిండి, పెరుగు రాత్రిపూట తినకూడదు.
  • పాలు మజ్జిగ కలిపి తాగకూడదు.
  • విత్తనాలు అమ్మకూడదు.
  • తిరిగి వేడిచేసిన అన్నం తినకూడదు 
  • దూడ లేని ఆవుపాలు, ఒంటెపాలు, ప్రసవించిన పదిరోజులలోపు ఆవుపాలు,గర్భంతో ఉన్న ఆవు పాలు తాగకూడదు.
  •  కొంగ, హంస, చిలుక, చకోరం, కోకిల, కాకి, కాటుకపిట్ట, డేగ, గ్రద్ద గుడ్లగూబ, చక్రవాకం, పావురం, తాబేలు,  ఊరకోడి, పెద్దపులి, పిల్లి, కుక్క,పంది, నక్క కోతి, గాడిద మాంసాలని తినకూడదు.
  • చేపలు, మాంసము, పరిశుద్ధం చేసి తినవచ్చు.
  • విప్రులకు మద్యం ఇవ్వకూడదు. వారు మద్యాన్ని త్రాగకూడదు, చూడకూడదు తాకకూడదు.

Post a Comment

0 Comments