Ad Code

Responsive Advertisement

వ్యాస భగవానుడు చెప్పిన ధర్మాలు (కుర్మా పురాణం) (5/6)

జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి
  • సాయంత్రం పూట, ప్రాతఃకాలంలో భిక్షాటన కోసం గృహస్థుల తలుపులు తట్టకూడదు 
  • ఇతరులు ఉపయోగించిన గంథాన్ని, పూలమాలల్ని గ్రహించకూడదు
  • విప్రుడు భోజనం చేస్తున్నప్పుడు, అది పూర్తికాకుండా మధ్యలో లేవకూడదు
  • అగ్నిని చేత్తో తాకరాదు. నీళ్ళలో ఎక్కువసేపు నిల్చోకూడదు.
  • అగ్నిని విసనకర్రతో కానీ, చేత్తో కానీ విసరకూడదు.నోటితో ఊదకూడదు. ఎందుకంటే 'అగ్ని' అనేది ముఖం నుంచే పుట్టింది కనుక.
  • పరస్త్రీలతో మాట్లాడకూడదు.
  • యజ్ఞార్హత లేనివారితో యజ్ఞాలు చేయించకూడదు
  • ఒంటరిగా సభలోకి ప్రవేశించకూడదు
  • ఆప్రదక్షిణంగా దేవాలయంలోకి ప్రవేశించరాదు.
  • వస్త్రాలతో దేవుళ్ళకి వీచకూడదు.
  • ఒంటరిగా దారిలో నడవకూడదు. వ్యాధిగ్రస్తులతో, పతితులతో కలిసి నడవకూడదు.
  • పాదరక్షలు లేకుండా నడవకూడదు. అగ్ని, గోవు, బ్రాహ్మణుల మధ్యనుంచి నడవకూడదు.
  • యోగుల్ని, సిద్దుల్ని, యతుల్ని నిందించకూడదు
  • దేవాలయం నీడని, దేవతల విగ్రహాల నీడని, యజ్ఞదీక్షితుల నీడని, గో, బ్రాహ్మణుల నీడని దాటకూడదు.
  • పాయసం, నేతితో వండిన పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సత్తు పిండి, తెలకపిండి శూద్రుల నుంచి తీసుకోవచ్చు.

Post a Comment

0 Comments