Ad Code

Responsive Advertisement

వ్యాస భగవానుడు చెప్పిన ధర్మాలు (కుర్మా పురాణం) (4/6)

జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి 

  • దేవతలు, బ్రాహ్మణులు, గోవులు వున్నవైపు కాళ్ళు చాపకూడదు.
  • ఉభయ సంధ్యల్లో, మధ్యాహ్న సమయాల్లో నిద్రపోకూడదు
  • ఆసనాన్ని పాదాలతో తాకరాదు
  • అపవిత్రుడుగా (మైలలో) ఉన్నప్పుడు అగ్నిని ఉపాసించకూడదు
  • ఎడమ చేత్తో నీళ్ళని తీసుకుని త్రాగకూడదు
  • వేగంగా ప్రవహించే నదిని ఎట్టి పరిస్థితుల్లో దాటరాదు 
  • నీళ్ళలో ఉండి సంభోగం చేయకూడదు
  • రావి చెట్టును ఎప్పుడు ఖండించకూడదు 
  • నీళ్ళలో ఉమ్మి వేయకూడదు
  • ఎముకలు, కపాలం, బూడిద, వెంట్రుకలు, ముళ్ళకంపలు, ఊక, బంగారం,బొగ్గులమీద, పిడకల మీద కూర్చోకూడదు.
  • నిప్పుని నోటితో ఊదకూడదు.
  • బావిలోకి దిగరాదు 
  • అగ్నిని అగ్నిలో పడవేయకూడదు
  • అగ్నిని (యాగాగ్ని) నీళ్ళతో చల్లార్చకూడదు.
  • మిత్రుడు మరణాన్ని, దుఃఖాన్ని తనకి తానుగా ఇతరులకి చెప్పకూడదు.
  • అమ్మకూడని వస్తువుల్ని, మోసం చేసి సంపాదించిన వస్తువుల్ని ఇతరులకి అమ్మకూడదు.
  • చేసిన ప్రతిజ్ఞని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు.
  • పశువుల్ని పక్షుల్ని, సర్పాల్ని పరస్పరం యుద్ధానికి ఉసిగొల్పకూడదు.
  • తనకు అవసరమైన అన్ని పనుల్నీ చేయించుకుని చివరికి ఆ పనులు చేసిన వాడిని వంచించకూడదు.

Post a Comment

0 Comments