Ad Code

Responsive Advertisement

వ్యాస భగవానుడు చెప్పిన ధర్మాలు (కుర్మా పురాణం) (3/6)

జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి

  • శిశ్న, ఉదర, కర్ణ చాపల్యాన్ని ప్రదర్శించకూడదు
  • దోసిలితో నీరు త్రాగకూడదు
  • కాళ్లతో , చేతులతో నీళ్ళని కొట్టకూడదు
  • ఇటుకలతో పండ్లుని రాలకొట్టకూడదు 
  • గోళ్ళతో చీల్చటం, తుంచటం, కోయటం, వ్రాయటం, మర్దించడం చేయకూడదు
  • పళ్ళెం ఒడిలో పెట్టుకుని భుజించకూడదు
  • నాట్యం, వాద్యం, గానం వీటిని కాలనియమం లేకుండా ఎప్పుడూ చేయకూడదు.
  • తలను రెండు చేతులతో గోకరాదు
  • లౌకిక స్తోత్రాలతో దేవుళ్ళని స్తుతించకూడదు 
  • పాచికలు ఆట కూడదు. అకారణంగా పరుగెత్తకూడదు 
  • నీళ్ళలో మల మూత్రాలు విసర్జించకూడదు
  • ఎంగిలి నోటితో ఉండరాదు
  • నగ్నంగా స్నానం చేయకూడదు, నగ్నంగా నడవకూడదు.నగ్నంగా వున్నపుడు పుస్తకాలూ చదవకూడదు.
  • దంతాలతో, గోళ్ళతో వెంట్రుకల్ని పీకకూడదు.
  • నిద్రపోతున్న వారిని అకారణంగా లేపకూడదు
  • ఎవరూ లేని ఇంట్లో ఒక్కడే నిద్రపోకూడదు
  • తన పాదరక్షలు తానే పట్టుకుని వెళ్ళకూడదు
  • అకారణంగా పదే పదే ఉమ్మకూడదు
  • కాళ్ళుతో  రుద్దుతూ కాళ్ళని కడగకూడదు
  • నిప్పుతో కాళ్ళని కాచరాదు. రాగిపాత్రలో కాళ్ళు కడగకూడదు.

Post a Comment

0 Comments