జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి
- రజస్వల స్త్రీతో మాట్లాడకూడదు
- దేవతలకు, గురువులకి, విప్రులకి, చేసే దానాన్ని ఆటంకరపచకూడదు.
- అవసరం లేకుండా ఉదయించే సూర్యుణ్ణిగానీ, చంద్రుణ్ణిగానీ అలాగే అస్తమించే సూర్య-చంద్రుల్నిగానీ, నీళ్ళలో ప్రతిబింబంలా, గ్రహణంలోపట్టి ఉన్నప్పుడు, ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు వారిని దర్శించకూడదు.
- నగ్నంగా ఉన్న స్త్రీనిగాని, పురుషుణ్ణిగానీ చూడకూడదు
- మలమూత్ర విసర్జన చేస్తున్నవాణ్ణి చూడకూడదు.
- మైలతో ఉన్నప్పుడు, సూర్యచంద్ర గ్రహణాలని చూడకూడదు.
- తుమ్ముతున్నప్పుడు, ఆవులిస్తున్నప్పుడు సుఖాసనం మీద ఉన్నప్పుడు భార్యను చూడకూడదు.
- నీళ్లు తన ప్రతిబింబాన్ని చూడకూడదు.
- మూత్రాన్ని దాటకూడదు. మూత్రం మీద కూర్చోకూడదు.
- గోళ్ళతో నేలమీద రాయకూడదు.
- ఒక నది దగ్గర మరొక నది గురించి ఒక పర్వతం దగ్గర మరొక పర్వతం గురించి మాట్లాడకూడదు.
- తన ఇంటికి, తనతో భోజనానికి కలిసి వచ్చేవాడిని విడిచిపెట్టకూడదు
- నగ్నంగా నీళ్ళలో దిగి స్నానం చేయకూడదు. అగ్నిని దాటకూడదు
- తలపై రాయగా మిగిలిన నూనె వంటిమీద రాసుకోకూడదు.
- సర్పాలతో ఆటలాడరాదు
- తన అవయవాలను అకారణంగా తాకరాదు.
- గుప్తవయవాలను , రోమాలను తాకకూడదు.
0 Comments