జీవితంలో ఆచరించాల్సిన ధర్మాలు కుర్మా పురాణంలో వ్యాస మహర్షి వారు చెప్పి వున్నారు. అవి.
- మానవుడు ఏ ప్రాణినీ హింసించకూడదు
- ఎప్పుడూ ఎక్కడా అబద్ధం చెప్పకూడదు
- అహాన్ని అప్రియాన్ని కలిగించే మాటలు చెప్పరాదు
- ఇతరుల వస్తువులు గడ్డికానీ, కూరలు కానీ, నీళ్ళుగానీ ఏది అపహరించకూడదు. అపహరిస్తే నరకం ప్రాప్తిస్తుంది.
- ప్రతిరోజూ యాచించకూడదు. ఒకే వ్యక్తిని రెండుసార్లు యాచించకూడదు
- దేవతలకు సంబంధించిన ద్రవ్యాలని అపహరించకూడదు
- ఎంత ఆపదవచ్చినా బ్రాహ్మణ ద్రవ్యం అపహరించకూడదు
- విషం విషం కాదు బ్రాహ్మణుడి సొమ్మే అసలు విషం.
- పాపాలు చేసి ధర్మం అనే పేరుతో వ్రతాలు నోములు చేయకూడదు
- ప్రతాలతో, దీక్షలతో తాము చేసిన పాపాల్ని కప్పిపుచ్చి స్త్రీలని శ మోసగించినవాడు, బ్రహ్మజ్ఞులతో నిందించబడతాడు. కపటంతో చేసే వ్రతం ఫలం సరాసరి రాక్షసులకే చేరుతుంది.
- దైవ ద్రోహం కన్నా గురుద్రోహం కోటిరెట్లు అధికమైన పాపాల్ని కలిగిస్తుంది.
- గురు ద్రోహం కన్నా వేదాల్ని నిందించటం, నాస్తికభావాల్ని ప్రచారం చెయ్యటం కోటిరెట్లు అధికపాపాన్నిస్తుంది.
- పుణ్య నదులు ప్రవహించే చోట విప్రులు నివసించాలి.
- నదీ తీరం నుంచి ఒక మైలు దూరం లోపే విప్రుడు నివసించాలి.
- సూతకం ఉన్నవారితో మాట్లాడకూడదు.
- ఎదుటివారి తమకు చెప్పిన రహస్యాలని బయటపెట్టి వారికీ సంతాపం కలిగించకూడదు.
0 Comments