Ad Code

Responsive Advertisement

చిలుకూరు బాలాజీ ఆలయం



చిలుకురు బాలాజీ ఆలయం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న చిలుకూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధ ఆలయం. ఇది హైదరాబాద్ నుండి 33 కి.మీ దూరంలో ఉంది.

ఇది తెలంగాణలోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో శ్రీ  వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి మరియు భూదేవితో కొలువైవున్నారు.

ఈ ఆలయంలో హుండీ  లేదు మరియు భక్తుల నుండి దక్షిణ స్వీకరించరు. వీసా బాలాజీగా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.

ఈ ఆలయం 500 సంవత్సరాల పురాతన ఆలయం. సాధారణంగా భక్తులు 11 ప్రదక్షిణాలను చేసి కోరిక కోరుకుంటారు, కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షిణాలు చేస్తారు. ప్రతిరోజూ ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.ఈ ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంది. 

భక్తరామదాసు మామయ్యలు అయిన అక్కన్న మరియు మదన్నా  ఈ ఆలయం నిర్మించారు.

ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. 

ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.

ప్రత్యేక పూజలు కూడా ఏమీ ఉండవు.

దర్శన సమయంలో విరామం ఉండదు.

ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం వంటివేవీ లేవు.

ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్ ఆలయాలు ఉన్నాయి.

బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి పూజలు జరపాలో అవే ఉంటాయి. అవి కూడా ఉచిత దర్శనమే.


పండుగలు :

శ్రీరామనవమి

బ్రహ్మోత్సవాలు 

ఆలయ వేళలు :

ఉదయం 05.00  నుండి రాత్రి 08.00 వరకు 

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

హిమాయత్‌సాగర్ అరా మైసమ్మ కాళి ఆలయం - 12

శంషాబాద్ శ్రీ రామ చంద్ర స్వామి ఆలయం - 19

నానక్రామ్‌గుడ శ్రీ రంగనాథ స్వామి ఆలయం - 20

సిద్దలగుట్ట శ్రీ వెండికొండ సిద్దేశ్వర స్వామి ఆలయం - 20

గుడిమల్కాపూర్ వెంకటేశ్వర ఆలయం - 21 కి.మీ దూరంలో 

Post a Comment

0 Comments