Ad Code

Responsive Advertisement

అనంత వ్రతం (అగ్ని పురాణం ప్రకారం)

మార్గశీర్ష మాసంలో మృగశీర్షా నక్షత్రం ఉన్నరోజు, గోమూత్రాన్ని కొద్దిగా త్రాగి పవిత్రుడై శ్రీహరిని పూజించాలి. అనంతుడైన శ్రీహరి తనని పూజించిన వాడికి అనంతమైన ఫలాల్ని ప్రసాదిస్తాడు. ఈ వ్రతం చేసిన వారికి రాబోయే జన్మలో కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఇది కోరిన కోరికల్ని తీరుస్తుంది. సంపదల్ని అక్షయంగా ప్రసాదిస్తుంది.

అనంత వ్రతాన్ని ఆచరించేవాడు ఉదయంపూట విధియుక్తంగా శ్రీహరిని పూజించి ఆ రాత్రి నూనె లేని పదార్ధాలతో భోజనం చేయాలి అనంతుడైన శ్రీహరిని ఉద్దేశించి మార్గశీర్ష మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకూ నెయ్యిని, చైత్రమాసం నుంచి ఆషాఢమాసం వరకు బియ్యాన్ని, శ్రావణ మాసం నుంచి కార్తీకం వరకు పాలు ఉపయోగించి అనంతుడి ప్రీత్యర్ధం హోమం చేయాలి. ఎంతో గొప్పదైన ఈ అనంత వ్రతాన్ని ఆచరించటం వల్లనే యవనాశ్వమహారాజుకి 'మాంధాత' అనే పుత్రుడు జన్మించాడు.

Post a Comment

0 Comments