Ad Code

Responsive Advertisement

గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు - పద్మ పురాణం ప్రకారం

పూర్వం కశ్యప ప్రజాపతి తన భార్య 'దితి' గర్భాన్ని ధరించగా ఆమెకి గర్భిణీ స్త్రీలు ఏ విధమైన నియమాలు పాటించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాల్ని ఈ విధంగా తెలియచేసాడు. ఇవి ఆనాడే కాదు ఈనాడు కూడా అందరూ ఆచరించతగ్గ నియమాలు ఇవి.

  • సంధ్యా సమయంలో భోజనం చేయకూడదు
  • చెట్టు మొదల్లో నిలబడకూడదు 
  • అతిగా నిద్రపోకూడదు, నీళ్ళలో దిగరాదు.
  • రోలు రోకలి వీటి జోలికి వెళ్ళకూడదు
  • శూన్యంగా ఉన్న ఇంటిలోకి వెళ్ళకూడదు
  • పుట్టలున్న చోట నిలబడకూడదు.
  • మనసుని ఆందోళనకి గురికాకుండా చూసుకోవాలి 
  • నేలమీద బొగ్గులతో, బూడిదలో గోళ్ళతో రాయకూడదు.
  • ఎప్పుడూ పడుకునే ఉండకూడదు.
  • వ్యాయామం, అధిక శారీరక శ్రమ చేయకూడదు
  • ఊక, బొగ్గులు, బూడిద, ఎముకలు పుర్రెలున్న చోట కూర్చోకూడదు
  • ఇతరులతో కలహమాడకూడదు. తలంటుకోకూడుదు
  • తల విరబోసుకుని తిరగకూడదు
  • అపరిశుభ్రంగా ఉండరాదు. ఉత్తరం వైపు తల పెట్టకూడదు
  • తల కిందకి వాల్చి పడుకోకూడదు
  • బట్టవిప్పుకొని, తడికాళ్ళతో ఉండరాదు
  • అమంగళకరమైన మాటలు అనకూడదు
  • ఎక్కువగా పరిహాసాలాడకూడదు
  • మాంగల్య అభివృద్ధి కోరి అగరుధూపాలతో దైవపూజ చేయాలి
  • అన్ని రకాల మూలికలు వేసి స్నానం చేయాలి
  • భర్త క్షేమాన్నే నిత్యం కోరుతూ చిరునవ్వుతో ఉండాలి.
  • ఎలాంటి స్థితిలోనూ భర్తని అసహ్యించుకోకూడదు


ఈ విధంగా గర్భిణీ స్త్రీలు నియమాల్ని శ్రద్ధగా పాటించినట్లైతే సకల శుభలక్షణాలు కలిగిన సంతానాన్ని అనాయాసంగా పొందుతారు.

Post a Comment

0 Comments