కార్తీక మాసం లో శుక్ల పక్ష పూర్ణిమ ని కార్తీక పూర్ణిమ అని అంటారు.
కార్తిక పూర్ణిమకే త్రిపుర పూర్ణిమ అని పేరు.
ఈ రోజు విష్ణు, శివాలయాలను భక్తులు దర్శించుకుంటారు.
పరమశివుడు త్రిపురాసురులను సంహరించింది ఈ పౌర్ణమినాడే.
ఈ రోజున ఆలయాలలో ముఖ్యంగా శివాలయాలందు జ్వాలాతోరణోత్సవాన్ని చేస్తారు. త్రిపురాసురులను వధించిన పరమేశునికి దృష్టిదోషం పోయేందుకు, యింకా విజయుడైన అతని గౌరవార్థం పార్వతీదేవి మొదటగా ఈ జ్వాలాతోరణోత్సవాన్ని జరిపించిందట.
ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా వారణాసిలోని అన్ని ఘాట్లలో దీపాలు వెలిగిస్తారు.
ఈ రోజు శ్రీకృష్ణ భగవాడునుడిని, రాధా దేవిని పూజిస్తారు.
తులసి వివాహం జరపడానికి ఈ రోజు ఆఖరి రోజుగా భావిస్తారు
ఈ రోజు శివాలయాలలో ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి
దేశ నలుమూలల ఈ రోజు జాతరలు జరుగుతాయి.
తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేస్తారు. తరువాత ఆలయానికి వెళ్లి భగవంతుండిని దర్శించుకుంటారు.
ఈ రోజు పౌర్ణమి కనుక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిసారు.
శివ లేదా విష్ణు ఆలయంలో 365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు.
కార్తీక మరియు ఇతర పురాణాలను చదువుతారు.
ఈ రోజు ఉపవాసం వుంటారు.
2021 తేదీ : నవంబర్ 18/19
0 Comments