అరుణాచలంలో కార్తీక దీపం వైభవాన్ని తిలకించడం కోటిజన్మల పుణ్యఫలం. 43 కోణాలున్న శ్రీ చక్రాకారంతో విలసిల్లే సుదర్శన అరుణగిరి.అందుకే దీనిని శంకరుని మేరువు అని అన్నారు. అరుణాచలం కొండ పై వున్నా గుహాలన్నీ తపోవనాలు.భగవాన్ రమణుల ప్రేరణతోనే అరుణాచలం గిరిప్రదక్షిణ ప్రసిద్ధి చెందింది.
అరుణాచలంలో గిరిప్రదక్షిణం శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానం. అసలు అరుణాచలమే శివుడు అని భగవాన్ రమణులు చెప్పేవారు. ప్రదక్షిణ మార్గంలో వినాయక ఆలయం వద్ద నిలబడి చుస్తే అరుణాచలం నంది ఈశ్వరునిలా కనిపించడం యాత్రికులకు అనుభవం.
రోజు ఎంతోమంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు.ముఖ్యంగా పౌర్ణమి రోజులలో ఎక్కువ మంది గిరిప్రదక్షిణ చేస్తారు. ప్రతి ఏడు కార్తీకమాసంలో కృతిక నక్షత్ర వేళ అరుణగిరి పై దర్శనమిస్తాను అని పరమేశ్వరుడు భక్తులకు వాగ్దానం చేసాడు. ప్రతి ఏడు వేల మంది భక్తుల సమక్షంలో కొండా పైన అతి పెద్ద ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం చుసిన వారికీ మోక్షం సిద్ధిస్తుంది అని చెబుతారు.
అరుణాచల క్షేత్రంలో భరణి దీపం ప్రత్యేక౦. పౌర్ణమికి ముందురోజు తెల్లవారుజామున ఆలయంలో దీపం వెలిగిస్తారు. పౌర్ణమినాడు ఆ దీపజ్యోతిని కొండా పైకి తీసుకువెళ్లి సాయంత్రం ఆరుగంటల వేళలో మహాదీపాన్ని అందరికి కనబడేలా ప్రజ్వలింపచేస్తారు. ఈ దీపాన్ని కార్తీగై దీపం అంటారు.
2021 : 19, నవంబర్ .
0 Comments