కార్తిక అమావాస్య నాడు పంచ పల్లపాలతో (రావి, మర్రి, జువ్వి, మోదుగు, మేడి) అభ్యంగన స్నానమాచరించాలి. దీనిని పంచత్వక్ ఉదక స్నానం అని అంటారు.
ఆశ్వయుజ, కార్తీక అమావాస్యల నాడు స్వాతి నక్షత్రం కలిసి ఉండే అవకాశం ఉంది కావున ఆశ్వయుజ అమావాస్య నాడు చేసే అన్ని విధులు కార్తిక అమావాస్య నాడు కూడా ఆచరించాలి.
స్వాతి నక్షత్రం పాడ్యమి లేదా విదియ నాడు ఉన్నా అభ్యంగన స్నానమాచరించాలి.
దారిద్ర్యాన్ని తొలగించుటకు లక్ష్మీపూజ చేయాలి.
ప్రదోష సమయంలో స్నానమాచరించి దేవాలయాల్లో, ఇంటిలో, దేవతా వృక్షాల వద్ద, కూడళ్ళలో దీపాలు వెలిగించి బ్రాహ్మణులను, పెద్దలను పూజించి భోజనం చేయాలి.
0 Comments