Ad Code

Responsive Advertisement

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు 2021 - విశాఖపట్నం.



శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు డిసెంబర్ 05 నుంచి జనవరి ‌03 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల్లో వచ్చే గురువారాల్లో లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. 

ముఖ్యమైన రోజులు 

డిసెంబర్ 09 , 16 , 23 , 30 

డిసెంబర్ 26  న వేదసభ, 
డిసెంబర్ 26  అర్చక సదస్సు, 
డిసెంబర్ 30  ఘటాభిషేకం నిర్వహిస్తారు. 

మార్గశిర గురువారాల్లో జరిగే విశిష్ట కార్యక్రమాలు :


12.05 నుంచి 1.30 గంటల వరకు విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన పూజ, స్వర్ణాభరణ అలంకరణ
1.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు సర్వదర్శనం
11.30 నుంచి 12 గంటల వరకు మహానివేదన(రాజభోగం)
మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వదర్శనం
సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారికి విశేష పంచామృతాభిషేక సేవ, సహస్ర నామార్చన , స్వర్ణాభరణ అలంకరణ
రాత్రి 7 గంటల నుంచి సర్వదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు

ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పంచామృతాభిషేకం, అమ్మవారికి సహస్ర నామార్చన
ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సర్వదర్శనం
11.30 నుంచి మ«ధ్యాహ్నం 12.30 గంటల వరకుపంచామృతాభిషేకం, అష్టోత్తర నామార్చన
12.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సర్వదర్శనం
సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు  విశేష పంచామృతాభిషేకం
రాత్రి 7 నుంచి వేకువజాము 4.30 గంటల వరకు సర్వదర్శనం

మండపంలో జరుగు వైదిక కార్యక్రమాలు.. (గురువారం మినహా..)
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పంచామృతాభిషేకం, శ్రీచక్ర నవావర్ణార్చన
ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు  మార్గశిర మాస విశేష కుంకుమార్చన
ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మార్గశిర మాస శ్రీలక్ష్మీ పూజ, వేదపారాయణ, మహావిద్యా పారాయణ, సప్తశతీ పారాయణ
ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అష్టోత్తర కుంకుమార్చన.

Post a Comment

0 Comments