• శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం హంసలదీవి గ్రామం కృష్ణ జిల్లాలో వెలసింది. ఈ ఆలయం కృష్ణ నది తీరాన ఉంది.
  • కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగర సంగమ క్షేత్రం ఇది.
  • ఈ ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువైనారు.
  • స్థలపురాణం ప్రకారం ఈ  ఆలయాన్ని దేవతలు కేవలం ఒక రాత్రిలో నిర్మించారు. సుమారు ఏడు దశాబ్దాలు క్రిందట ఆలయ నిర్మాణం జరిగింది.
  • ఈ ఆలయ గోపురం ఐదు అంతస్తులు ఉండగా, ముఖమండపంలో అనేక శాసనాలు ఉన్నాయి. 
  • ఈ సంగమంలో స్నానం చేస్తే కాకులు కూడా హంసలుగా మారిపోతాయి అని చెబుతారు.
  • ఈ పుణ్యక్షేత్రం బంగాళాఖాతం అంచున ఉంది.
  • మాఘపౌర్ణమికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. కృష్ణాష్టమి, ధనుర్మాసం ఇంకా ఉత్సవాలు జరుగుతాయి.


ఆలయ వేళలు 


ఉదయం 6.00 నుండి రాత్రి 9.30 వరకు 


ఎలా వెళ్ళాలి


మోపిదేవి నుండి 28 కి.మీ 

మచిలీపట్టణం నుండి 35 కి.మీ 

విజయవాడ నుండి 98 కి.మీ

అమరావతి నుండి 126 కి.మీ